నగవులు నీ సంచీని నువ్వు మోసుకొంటూ నా భారాన్ని నేను లాగిస్తూ... సూరీడు తోపాటు పరుగులెట్టాం ముళ్ళుగుచ్చుకున్నా పూలు అలదుకున్నా నడకవేగం ధృతి చెరగకుండా సూ రీడితోపాటే మనమూ పడమటి దిక్కు కు పరుగులెత్తాం మనజీవితాశయాలు జలాశయాలైనా బడబాగ్నులనీ చిర్నవ్వు తో మోసేసాం మన ఆనందాలు ఎడార్లో. మృగతృష్ణ లైనా సంధ్యారాగం తో సాగరఘోషకు 'సత్తు'వ గా నిలిచాం పశ్చిమాన సూరీడు కన్నువిప్పుకుంటుంటే పెదవులపై నగవులు పూయిస్తున్నాం రాయసం లక్ష్మి